కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు గెలవడం చేతకాక కత్తులతో తెగబడుతున్నారు
మన తెలంగాణ/కామారెడ్డి/బాన్సువాడ/ సంగారెడ్డి బ్యూరో/నారాయణఖేడ్: ‘చేతకా ని దద్దమ్మలు, వెధవలు దాడులకు దిగబడు తున్నారు. కత్తులు పట్టి బిఆర్‌ఎస్ అభ్యర్థుల పై దాడులు చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. దీనికి తెలంగాణ సమాజమై బుద్ధి చె ప్పాలి. కత్తి పట్టుకుని పొడవాలంటే ఇంత మందిమి ఉన్నం చేతుల్లేవా మొండితో లం డుతో కత్తి దొరకదా? మాకు తిక్కనే రేగితే దుమ్ము రేగాలే తస్మాత్ జాగ్రత్త’ అని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దౌ ల్తాబాద్ మండలం సూరంపల్లిలో బిఆర్‌ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరగడం దురదుష్టకరమని సిఎం కెసి ఆర్ అన్నారు. బాన్సువాడ, నారాయణఖే డ్‌లో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఇవాళ నా మనసు ఏమీ బాగోలేదు. 10 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. కానీ ఏనాడూ మనం హింసకు దిగలేదు. గెలిపిస్తే గెలిచినం చేతనైన కాడికి సేవచేసినం. గెలుపు కోసం ఎప్పుడు కూడా దుర్మార్గమైన ప నులు చేయలేదు. అది మన నైజం కాదు అని సిఎం కెసిఆర్ తెలిపారు.
మా సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇవ్వాళ దుబ్బాక అభ్య ర్థి మీద జరిగిన దాడి కెసిఆర్ మీద జరిగిన దాడిగా చెబుతు న్నా ఈ దాడులు ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మేము కూడా అదేపనికి పూనుకుంటే దుమ్మ కూడా మిగలద ని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. మేం ఎంతో బాధ్యతలో ఉ న్నాం. ప్రజలు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ అ భివృద్ధికి శ్రీకారం చూడుతున్నామన్నారు. కరెంటు ఎట్ల రా వాలే, నీళ్లు ఎట్ల రావాలే, ఇంకా రాష్ట్రాన్ని ఏలా ముందుకు తీ సుకపోవాలే అనే నిరంతర ఆలోచనతో ఉంటామన్నారు. అం తేకానీ పదవుల కోసం ఏనాడు దుర్మార్గమైన ఆలోచన చేయలేదన్నారు. అలా చేస్తే ఇప్పటికే ఎన్నో చేసి ఉండేవాళ్లమన్నారు. మీ ఎజెండా ఏందో చెప్పే దమ్ము మీకు ఉందా, ప్రజల ముందుకు రండి, మీ వాదనేంటే చెప్పండి. మా వాదన మేం చెబుతాం, ఎవరిని ప్రజలు గెలిపిస్తే వారు పరిపాలన చేయాలని అన్నారు. లేకుంటే ఎవని కున్న పని వాడు చూసుకోవాలని సూచించారు. అంతేకానీ లంగ చాతలు ఏంది? గుండాగురి ఏంది? కత్తుల పట్టి పొడిచేది ఏంది అని ప్రశ్నించారు. అక్కడ గన్‌మెన్ అప్రమత్తంగా ఉన్నాడని కాబట్టి ప్రాణాపాయం తప్పిందన్నారు.
ఈదాడిలో గన్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయని దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని, తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ పె ద్దలు, తెలంగాణ శ్రేయస్సు కోరే వాళ్లందరూ హింసా రాజకీయాలను ఖండించాలని సిఎం కోరారు. పిరికిపందలు చేతకా ని వాళ్లు ఇటువంటి పనులు చేస్తారన్నారు. చేతనైన మొగోడు ఎవ్వడూ ఈ పనిచేయ్యడు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మనసు ఉల్లాసంగా లేదని, శ్రీనివాస్ రెడ్డిని పెద్ద మెజారిటీతో గెలిపించి రాష్ట్ర స్థాయిలో వారి గౌరవాన్ని మరింత పెంచాలన్నారు. బాన్సువాడ బిఆర్‌ఎస్ అభ్య ర్థి, స్పీకర్ పో చారం శ్రీనివాస్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని, మరోసారి పెద్ద పదవి ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతుబంధు, దళితబంధును ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
2004 లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరో పదేళ్లు ముందుండేవాళ్లమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు లేవన్నారు. ఓటు బ్రహ్మస్త్రమని, ఒక్కసారి ఆ లోచించాలన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం లోతెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. తెలం గాణ చిన్న వయస్సున్న రాష్ట్రమని, యావత్ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దళారుల వ్యవస్థ వస్తుందన్నారు. తెలంగాణ రాక ముందు అనేకసార్లు బాన్సువాడకు వచ్చానని, పిడికెడు మం దితో ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. 1969 తరహాలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని మరోసారి చూశారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి 5 గంటలు మా రా ష్ట్రంలో కరెంట్ ఇస్తున్నామని చెప్ప డం హాస్యాస్పదమన్నారు. నిజాంసాగర్‌ను గత పాలకులు సర్వనాశనం చేశారన్నారు. గతంలో నిజాంసాగర్‌కు నీళ్లు రావాలంటే శ్రీనివాస్‌రెడ్డి ధర్నా లు చేశారని గుర్తు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ఎప్పుడు రుబాబు చేయరని, అనేక రిజర్వాయర్లను నిర్మిస్తున్నారని అటువంటి నాయకున్ని గెలిపించే బాధ్యత మీపై ఉందన్నారు.
సిఎం అయిన నా నియోపజకవర్గంలో కూడా 11 వేల డబుల్ బెడ్రూంలు కట్టలేదని కానీ బాన్సువాడలో శ్రీనివాస్‌రెడ్డి కట్టించారని దీనికి మెచ్చుకోవాల్సిన విషయమన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మిపుత్రుడని అని సిఎం కితాబు ఇచ్చాడు. ఆయన లక్ష్మి పుత్రుడు కాబట్టే బాన్సువాడ గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పోచారం ఎక్కడ అడుగుపెట్టిన లక్ష్మి తాండవిచ్చేందన్నారు. ఏ పని మొదలు పెట్టిన బ్రహ్మాండంగా శుభ్రప్రదమయ్యేందన్నారు. రైతుబంధు, ఢిల్లీ లో వారం రోజులు కొట్లాడి ఎరువులు తీసుకొచ్చారని అందు కే ఆయనకు లక్ష్మిపుత్రుడని పేరు పెట్టానని సిఎం ఈ సందర్భంగా తెలిపారు. సమైక్య పాలనలో నిజాంసాగర్ ఎండిపోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధ్ది, సంక్షేమమే ము ఖ్యమని, అందరం కలిసి కట్టుగా గంగా, జమున, తహజీబ్‌గా ఉందమన్నారు. దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి సిఎం కెసిఆర్‌పై జరిగిన దాడిగా భావిస్తున్నానన్నారు. నా మనస్సు బాగా లేదని, మాట్లాడేది అంతా బాన్సువాడ సభలో స్పీకర్ మాట్లాడారన్నారు. మరోసారి లక్ష మెజార్టీతో గెలిపిస్తే మరో పెద్ద పదవి అప్పగిస్తామన్నారు. ప్రజలను చూస్తుంటే మరోసారి లక్ష మెజార్టీతో గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో మాజీ మంత్రి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, టీసీసీఐ ఛైర్మన్ బాలమల్లు, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వరతో 1.80లక్షల ఎకరాలకు సాగునీరు
కాంగ్రెస్ నాయకులు చేతకాని దద్దమ్మలని తాము తలుచుకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామని, తిక్క రేగితే తడాఖా చూపిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తాము తలుచుకుంటే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయనిహెచ్చరించారు. ప్రజలకు నచ్చజెప్పాలే తప్పా, తమ అభ్యర్థులపై దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాలు దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక ప్రచారంలో ఉండగా కత్తులతో దాడి చేశారని తన మనసు బాగాలేదని, తాను ఇప్పుడు త్వరగా హైదరాబాద్ వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సి ఉందని సిఎం అన్నారు. వాస్తవంగా తాను జుక్కల్ సమావేశం నుంచే నేరుగా హైదరాబాద్ వెళ్లాలని భావించినట్లు తెలిపారు. కాకుంటే ఇంత మంది ప్రజలు ఎదురుచూస్తున్నప్పుడు వారిని కలిసి పది నిమిషాలు మాట్లాడకపోతే బాగుండదని మీ ఆశీర్వాదం కోసం వచ్చానని సిఎం తెలిపారు. ఈ మంత్రి హరీశ్‌రావు కూడా రావాల్సి ఉండేదని హైదరాబాదులో కొత్త ప్రభాకర్ రెడ్డి వద్ద అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకుంటే తాము కూడా తిరిగి సమాధానం చెప్తామని ఇంతమందిని ఉన్నాము ఊరుకుంటామా అని ఆయన అన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని భూపాల్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, తన దగ్గరకు ఎప్పుడు వచ్చినా అభివృద్ధి పనుల గురించి చర్చించారని చెప్పారు. సొంత పనుల గురించి ఏనా డు తన వద్దకు రాలేదని పైరవీలు తీసుకురాలేదని, అలాంటి మంచి వ్యక్తిని ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. ఒకప్పుడు నారాయణఖేడ్ ఎలా ఉండేదో ప్రజలు తెలుసుకోవాలని ఇప్పుడు నారాయణఖేడ్ ఎలా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకోవాలని కెసిఆర్ పేర్కొన్నారు. భూపాల్ రెడ్డి కోరిన ప్రకారం త్వరలో నల్లవాగుపై లిఫ్టును ఏర్పాటు చేస్తామని దాని శంకుస్థాపనకు ప్రారంభోత్సవాన్ని కూడా తానే వస్తానని చెప్పారు. అదేవిధంగా మాసంపల్లి రోడ్డును కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఖేడ్‌కు రావాలంటే భయపడేవారని ఇప్పుడు ఖేడ్‌లో ఉంటామని ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నారన్నారు.
గత పాలనలో కరెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడో ఏ విధంగా ఉందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. నారాయణఖేడ్‌లో రేకు డబ్బాలు ఉండేవని భూపాల్‌రెడ్డి గెలిచాక అన్ని బిల్డింగ్‌లు కనిపించాయని, ఖేడ్ అభివృద్ధిని హెలికాప్టర్‌లో చూశానన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు లక్ష 80వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మల్లన్నసాగర్ కాల్వ నర్సాపూర్ వరకు వచ్చిందని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. కర్ణాటక డిప్యూటీ సిఎం ఇటీవల తెలంగాణకు వచ్చినప్పుడు తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఉన్నదని అలా చెప్పేందుకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి ఐదు గంటలకు కరెంటు గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బీబీ పాటిల్, అసెంబ్లీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ,జిల్లా నేతలు పాల్గొన్నారు.