Monday, December 23, 2024

యువతకు ఎన్నికల్లో అవకాశం ఇస్తే సత్తా చాటుతాం

- Advertisement -
- Advertisement -

ఎంపి డాక్టర్ లక్ష్మణ్‌ను కలిసిన రామ్ యాదవ్
మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటు కేటాయించాలని వినతి

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఈ సారి యువతకు ఎక్కువ సీట్లు కేటాయించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిసి సిఎం నినాదం బలంగా పని చేసింది. బిసి వర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే తరహాలో బిసి జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణలో పార్లమెంట్ సీట్లను బిసి వర్గాలకు అధిక సీట్లు కేటాయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బిజెవైఎం క్రీడా విభాగం కన్వీనర్ జి రామ్ యాదవ్ ఎంపి డాక్టర్ లక్ష్మణ్ ను కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సీటు కేటాయించాలని కోరారు.

రామ్ యాదవ్ కృష్ణ ధర్మ పరిషత్ జాతీయ కార్యదర్శిగా హిందూ ధర్మ ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. హిందూ ఐక్య వేదికగా పని చేస్తూ రామాలయం సాధన, స్థాపనలో మోదీని కీర్తిస్తూ నలు మూలలా ప్రచారం చేశారు. పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో కీలకంగా మారారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ దేశంలోనే పెద్ద నియోజకవర్గంగా ఉంది. మినీ ఇండియాగా ఈ నియోజకవర్గం భావిస్తారు. ఇతర రాష్ట్రాల మూలాలు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బిసి వర్గానికి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సారి బిసి వర్గానికి చెందిన యువతకు ఇవ్వటం ద్వారా పార్టీకి గెలుపు సులభంగా మారుతుందని రామ్ యాదవ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News