Wednesday, January 22, 2025

సామ్రాజ్యవాదులకు తలొగ్గితే ఆఫ్రికా దేశాలకు పట్టిన గతే మనకు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: అంతర్జాతీయ సామ్రాజ్యవాదులకు నయా ఫాసిస్ట్ ప్రధాని మోడీ తలొగ్గి వ్యవసాయాన్ని సరుకుగా మార్చ డమే లక్షంగా ప్రయత్నాలు కుట్రలకు పాల్పడుతున్నారని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ విమర్శించారు. అందుకు అనుగుణంగానే కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం మూడు వ్యవ సాయ చట్టాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందర య్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం అరిబండి లక్ష్మీనారాయణ 5వ స్మారకోపన్యాసం సభ జరిగింది. అరిబండి ఫౌండేషన్ అరిబండి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అరిబండి ప్రసాదరావు అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదులు వ్యవసాయ రంగంలోకి చొచ్చుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసా య చట్టాలను రైతులు తిప్పికొట్టినా, ఇంకా ఆ చటాల వల్ల ప్రమాదం పొంచి ఉం దన్నారు. నేటి పాలకులు ఆమోద యోగ్యంగానే పరోక్ష దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సామ్రాజ్యవాదులకు లొంగిపోతే ఆఫ్రికా దేశాలకు పట్టినగతే పడుతోందని అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజో కృష్ణన్ మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని మోడీ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం కారణంగా దేశంలో 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాల యం రిటైర్డ్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఏఐకేఎస్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ప్రొఫెసర్ జలపతిరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నంధ్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News