Saturday, December 21, 2024

బిజెపికి భయపడితే ఆస్కార్ వచ్చేదా..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు నానా యాగి చేసి విద్వేషాలను కూడా రెచ్చగొట్టారని, వారికి భయపడి సినిమాను విడుదల చేయక పోతే ఈ రోజు ఆస్కార్ అవార్డు వచ్చేదా? అని టిఎస్ రెడ్కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. సినిమా రిలీజ్ చేస్తే థియోటర్లను తగలబెడతామంటూ స్వయంగా బండి సంజయ్ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు.

ఆనాడు బిజెపి నేతలు చేసిన ఆ మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా? తెలంగాణ పేరు.. భారతదేశం పేరు .. నేడు ప్రపంచ వేదికపై మారుమోగేదా? అని ప్రశ్నించారు. బిజెపి వాళ్లు ప్రస్తుతం అవార్డు రాగానే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారన్నారు. బెదిరించేదీ వాళ్లే.. అవార్డు రాగానే సంబరాలు చేసే ద్వంద్వ నీతి బిజెపిదని మండిపడ్డారు. ఇంత అద్బుతమైన సినిమాని కనీసం ఆస్కార్‌కి నామినేట్ చేయాలని సోయి కూడా కేంద్రంలోని బిజెపి సర్కారుకు లేకుండా పోయిందని సతీష్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News