వనస్థలిపురం: ఇంటిని, ఇంట్లోని విలవైన డ్యాక్‌మెంట్‌లను భద్రంగా చూసుకోమని చెప్పి ఇతర దేశాలకు వెళ్లిన వ్యక్తి ఇంటికి కన్నం వేసిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోన్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగ చక్రవర్తిని ఇంటి యజమాని అయిన రామకృష్ణారావు 2015 సంవత్సరంలో అస్టేలియాలో స్థిరపడిన తన ముగ్గురి కుమారుల పేరుమీద నగరంలో లక్షలాదిరూపాయల విలువగల ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఇంట్లో భద్రపరచినాడు. ఇంటి విలువైన డ్యాకుమెంట్లను ఇంటిని భద్రంగా చూసుకోమ్మని కింది పోర్సన్‌లో నాగ చక్రవర్తిని ఉంచి ఆస్టేలియాకు వెళ్లిపోయాడు.
2022 ఆగస్టులో రామకృష్ణ దంపదులు తిరిగి వచ్చారు. ఇంట్లో ఉన్న డ్యాంక్‌మెట్లు కనిపించకపోవడంతో చక్రవర్తిపైన అనుమానం వచ్చిన రామకృష్ణ వనస్థపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు నాగ చక్రవ్యర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణ ఇంట్లో ఉన్న డ్యాంక్‌మెంట్‌లను రెండు లక్షల యాబై వేల రూపాయలకు నాగ చక్రవర్తి బాలకృష్ణకు విక్రయించినాడు. బాలకృష్ణ ఇంటి డ్యాక్‌మెంట్‌లకు సంబధించిన భూమిని హరీష్, రమేష్ బీరప్ప, సందీప్‌లకు విక్రయించాడు. కొనుగోలు చేసిన వ్యక్తితోపాటు బాలకృష్ణను, చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.