Thursday, January 23, 2025

మంచి చేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ప్రజలకు మేలు చేసే ప్రతి నాయకుడిని గుండెల్లో పెట్టుకుంటారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకఅధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆదివారం పట్టణంలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో నందమూరి తారక రామారావు విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేదాసరి మనోహర్‌రెడ్డితోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసినకార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవడం
శుభపరిణామమన్నారు.

తెలుగువారికి నాయకుడంటే తారక రామారావులా ఉండాలని, తెలుగు వారికి, ముందు తరాలకు రాజకీయాలు నేర్పిన విజ్ఞానికీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతోపాటు టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికిపూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతకుంటవిజయరమణరా వు, బిరుదు రాజమల్లు, ఆయా పార్టీల నాయకులు, అభిమానులు సత్యనారాయణ రెడ్డి, నూగిల్ల మల్లయ్య, గోపగాని సారయ్యగౌడ్, ఉప్పురాజు, భూతగడ్డ సంపత్, మస్తర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, సాయిరి మహేందర్, ఎడెల్లి శంకర్, తూముల సుభాష్, తాండూరి శ్రీమాన్, దొడ్డుపల్లి జగదీష్,కారెంగుల రమేష్, కొమ్ము శ్రీనివాస్, ఆరె సంతోష్, ఆర్కుటి సంతోష్, గన్నమనేని తిరుపతిరావు, గంగుల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News