నిజామాబాద్ : రైతుల ఆకలి బాధలు, ఆత్మహత్యల పరిస్థితులను చూసి చలించిన ముఖ్యమంత్రి వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అక్కసు వెలగక్కుతుందని ఆర్‌అండ్‌బి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాత్రిపూట ఎప్పుడో కరెంటు ఇచ్చే వారని కరెంటు షాక్‌లు, పాము కాటులతో చనిపోయే వారని అసలు కరెంటు ఎప్పుడువస్తుందో తెలియదని ఆయన అన్నారు. మళ్లీ పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు పునరావృతం అవుతాయని ఆయన అన్నారు.
వ్యవసాయరంగానికి మూడే గంటలు విద్యుత్ సరఫరా సరిపోతుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని చూపుతున్నాయని, రైతులు రేవంత్‌రెడ్డి చెప చెప్పులేమనిపేచేలా నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉచిత కరెంటు వద్దంటే కాంగ్రెస్ అంటుంటే బిజెపి కరెంటు కాడా మీటర్లు పెట్టాలని చూస్తుందని ఒకరు దళారులకు పని చేస్తుంటే, మరొకరు అదాని కోసం పని చేస్తున్నారని, ఈరెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉచితాలు వద్దంటున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్‌లు ఎస్తేరని, రైతుబంధు, రైతుబీమాను రద్దు చేస్తారని ఆయన అన్నారు.