నాగరకర్నూల్ ప్రతినిధి : కేజిబివిల్లో టీచింగ్ ఉద్యోగాల ఫలితాల ఆధారంగా శుక్రవారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులు తమకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేది శనివారం మధ్యాహ్నం 1 గంటల లోపు డిఈఓ కార్యాలయంలో తెలపాలని డిఈఓ గోవిందరాజులు తెలిపారు. కేజిబివిల్లో ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను గురువారం రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు విడుదల చేశారని, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారన్నారు.
శుక్రవారం నాగర్‌కర్నూల్ డిఈఓ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని డిఈఓ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ కేజిబివిల్లో ఖాళీగా ఉన్న 44 టీచింగ్ పోస్టులకు గాను మెరిట్ జాబితా నుంచి ఖాళీలకు అనుగుణంగా 1:3 నిష్పత్తిలో 132 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తి చేయడం జరిగిందన్నారు. మెరిట్ జాబితాను నేడు విడుదల చేయడం జరుగుతుందని, శనివారం మధ్యాహ్నం 1 గంటలలోపు మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని ఆయన సూచించారు.
ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేసి ఎంపికైన విషయం అభ్యర్థులకు తెలియజేయనున్నట్లు డిఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ సూర్య చైతన్య, నోడల్ అధికారి కురుమయ్య, ఏసి రాజశేఖర్ రావు, కో ఆర్డినేటర్లు నూరుద్దీన్, మురళీధర్ రెడ్డి, బరపటి వెంకటయ్య, షర్పుద్దీన్, డిఎస్‌ఓ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగరాజు, పర్యవేక్షకులు సుజాత, రవి యాదవ్, శైలజ తదితరులు పాల్గొన్నారు.