Monday, December 23, 2024

పొన్నం దమ్ముంటే కార్పొరేటర్‌గా గెలిచి చూపించు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పొన్నం ప్రభాకర్ దమ్ముంటే వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి చూపించు… గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సవాల్ విసిరారు.

నిన్న హుజూరాబాద్ లో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌లపై కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ… మేయర్ మండి పడ్డారు. గురువారం నగరంలోని మున్సిపల్ మేయర్ చాబంర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సీజన్ వస్తున్నా కొద్ది ఎన్నడు ప్రజల మద్య లేని… పదవుల సమయంలో ప్రజలకు సేవ చేయలేని పొన్నం ప్రభాకర్ లాంటి కనీస అవగాహన లేని వ్యక్తులు వస్తున్నారని ఆరోపించారు. పొరపాటునో… గ్రహాపాటునో… ఒక్క సారి ఎంపిగా గెలిచిన పొన్నం ప్రభాకర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలతో పాటు, ప్రతి ఎన్నికలో ఓడిపోయి అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

కనీస రాజకీయ విలువలు పాటించకుండా మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌లపై సైకోలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రజల మద్దతు లేని స్క్రాప్ లా తుప్పుపట్టిన చెత్తలా మారిపోయారని అన్నారు. పొన్నం భాషలోకి మేము దిగితే అంతకన్న మంచి భాష మాకు వస్తదని అన్నారు.

కానీ పొన్నం ప్రభాకర్ లా సంస్కార హీనులం కాదన్నారు. ప్రతి ఒక్కరిని పొన్నం అనగతొక్కి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారన్నారు. ప్రజల్లో మద్దతు లేని వారు, ప్రజల సమస్యలు తెలియని వారు, వారి కష్టనష్టాలు తెలియని వారు, ఏ రాజకీయ నాయకుడైనా. ఉన్నారంటే అది పొన్నం ప్రభాకర్ మాత్రమే అన్నారు.

ఖబర్దార్ పొన్నం నీ భాష మార్చుకోకుంటే ఇదే విధంగా కొనసాగితే తగిన బద్ది చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర , జాతీయ స్థాయిలో ఒక్క పోస్టు లేదు, మీరోక పనికి రాని వస్తువని పొన్నంపై మండిపడ్డారు. అలాంటి వ్యక్తివి కరీంనగర్ ను అభివృద్ధి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌ల మాట్లాడటం సరికాదని, మల్లీ ఇదే తంతు కొనసాగిస్తే తగన బద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్, కార్పోరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News