Monday, December 23, 2024

ఏకాగ్రతతో చదివితే జీవిత లక్ష్యాన్ని చేరొచ్చు

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

నవాబుపేట: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి లక్ష్యం వైపు పయనిస్తే.. విజయం తప్పకుండా వరిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నవాబుపేట మండల కేంద్రంలో అక్షర చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య, సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో సాధన చేస్తే విజయతీరాలకు చేరవచ్చని తెలిపారు.

పరీక్షలు అంటే ఎవరు కూడా భయపడవద్దని, పరీక్షలు అంటే పండుగల సంతోషపడి రాయాలన్నారు. జీవితంలో 10వ తరగతి విద్యార్థులకు మొదటి సోపానమన్నారు. విద్యార్థులు ఎవరు కూడా పరీక్షలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో చదువుకొని పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News