Thursday, January 23, 2025

అభివృద్ధిపై నోరుజారితే ప్రజలే కర్రుకాల్చి వాత పెడతారు

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్:కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరుపారేసుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మున్సిపల్ పరిధిలోని ఎస్వీర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు గజమాలతో భారీ స్వాగతం పలికారు.

అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటే మూడోసారి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని 9 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నీకు కనపడటం లేదా అని ఎమ్మెల్యే అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గ్రామాల్లో తిరుగుతూ చేసిన అభివృద్ధి అంతా తానే చేశానని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమతాకృష్ణ, కౌన్సిలర్లు పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి, కూకట్ల గోపి, గుర్రాల శ్రీనివాస్, రేవెల్లి తిరుపతి, పాసెడ్ల మమత, సంపత్, గొట్టం లక్ష్మి, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తిప్పారపు దయాకర్, ఆరేపల్లి ఇలా రావు, యూత్ నేతలు కనవేన సతీష్, గొట్టం మహేష్, సాజిద్, సర్వర్, రఫీక్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆశాలు, ఉస్తెం రవీందర్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News