Monday, January 27, 2025

కాంగ్రెస్‌కు ఓటేస్తే మూడు గంటల కరెంటే

- Advertisement -
- Advertisement -
  • పోతిరెడ్డిపల్లి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి: మోసపూరిత కాంగ్రెస్ గ్యారంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం కోస్గి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి,గుండ్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే కాంగ్రెస్ నాయకులు అబద్ధపు పథకాలను ప్రచారం చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మొదటి నుంచి కాంగ్రెస్ మోసాలతో కూడుకున్న పార్టీ అని,ఎప్పుడు కుమ్ములాటలతో పేరుగాంచిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పది మంది పోటి పడి కుమ్ములాడుకుంటున్నారు. కర్ణాటక ప్రజలకు ఐదు గంటలే కరెంట్ ఇస్తుండడంతో కటిక చీకట్లో బతుకులు వెళ్లదీస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు,పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు అండగా ఉందన్నారు. రైతులకు రైతుబీమా, పెట్టుబడి సాయం, రుణమాఫీ వంటి పథకాలతో అండగా ఉన్నది బిఆర్‌ఎస్ అని చెప్పారు.

మూడోసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ రూ.5 లక్షల బీమా,సౌభాగ్యలక్ష్మీపథకం ద్వారా నిరుపేద మహిళలకు నెలకు రూ.3 వేలు ఫించన్, రూ,400 లకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపల్లి నుంచి కోస్గి వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామాల్లో సిసి రోడ్డు నిర్మాణం చేశామన్నారు. కోస్గి నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా పరిగి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ నిచ్చారు. అనునిత్యం ప్రజ లకు అందుబాటు మీతోపాటు కార్యకర్తగా చేసి మారింత అభివృద్ధి చేస్తానని అందుకు మరోమారు తనను ఆదరించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష్, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, జెడ్పిటిసి ప్రకాష్‌రెడ్డి, సింగల్ విండో చైర్మన్ తూంభీంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు హన్మంతురెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు మ్యాకల రాజేష్, కౌన్సిలర్లు భలేష్, బందెప్ప, అమృతమ్మ, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, మోహన్‌లతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News