కాసిపేట: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వెనకటి పాలన తీసుకొస్తారని రైతులను నిండ ముంచుతారని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య అన్నారు. విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన వాక్యలను నిరసిస్తు బుధవారం కాసిపేట మండలంలోని కొండాపూర్ వద్ద బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ చిన్నయ్య మాట్లాడూతూ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్తు చాలు అని అనడం దుర్మర్గం అని ఆయన విమర్శించారు. తె లంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తుండగా రైతులకు ఉచిత విద్యుత్ సరికాదు అనడం దారుణం అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులకు 24 గంటల కరెంట్ 3 గంటలుగా మారుతుందని, ధరణి తీసవేస్తారని, రైతు బందు తీసివేస్తారని, రైతులకు సకాలంలో ఎరువులు, మందులు కూడా రావని ఆయన జ్యోస్యం చెప్పారు. ప్రభుత్వం రైతుల కోసం ఎన్నొ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు వాటిని తీసివేసే యోచనలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి పల్లె చెంద్రయ్య, ఎంపిపి రొడ్డ లక్ష్మీ, వైస్‌ఎంపిపి పుస్కూరి విక్రంరావ్, మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, కార్యదర్శి మోటూరి వేణు, ఎంపిటిసిలు అక్కెపల్లి లక్ష్మీ, నవనందుల చంద్రమౌళీ, కొండబత్తుల రాంచెందర్,జిల్లా సర్పంచ్‌ల సంఘం అద్యక్షులు సాపాట్ శంకర్, సర్పంచ్‌లు మక్కల శ్రీనివాస్, ముత్యాల స్వప్న,
దరావత్ దేవి, ఆడె జంగు, ఉపసర్పంచ్‌లు శ్యాంశేఖర్, పిట్టల సుమన్, బోయిన తిరుపతి, సుమన్‌గౌడ్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు ఏనుగు మంజూలారెడ్డి, అప్పాల శేఖర్, మాజీ జడ్పిటిసి రౌతు సత్తయ్య, మాజీ సహాకార సంఘం చైర్మెన్ పుస్కూరి వంశీకృష్ణారావ్, కో ఆఫ్సన్‌మెంబర్ సిరాజ్‌ఖాన్, నాయకులు అగ్గి సత్తయ్య, లంక లక్ష్మణ్, వాసుదేవ్, ఎం. వేణు, రాజన్న, ప్రేంకుమార్,అనంతరావ్, రాజగౌడ్, తిరుపతి, ప్రభాకర్, శంకర్, భీమయ్య, పెంటు, మల్లేష్, సక్కు తదితరులు పాల్గోన్నారు.