- Advertisement -
హైదరాబాద్: ప్రజలను కష్టపెట్టేకన్నా తన ఇల్లును కూల్చమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ‘‘ ఒకవేళ నా ఇల్లును కూల్చడం వల్ల మీకు శాంతి కలుగుతుందంటే, అలాగే చేయంది, కానీ అర్థంపర్థం లేకుండా కూల్చివేతలకు పాల్పడకండి’’ అన్నారు. జనుల ఇళ్లను కూల్చి వారి బతుకులు ఛిద్రం చేయొద్దని కెటిఆర్ ముఖ్యమంత్రిని కోరారు. చేతనైతే కొడంగల్ లోని తన ఇంటిని, అలాగే, దుర్గం చెరువులోని ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చమని సవాలు విసిరారు.
‘‘ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలు, బఫర్ జోన్లలో నివసించే ప్రజలకు మీ ప్రభుత్వమే(కాంగ్రెస్) డాక్యుమెంట్లు ఇచ్చింది. ఇప్పుడు మీరే వారిని కబ్జాదారులంటూ బుల్ డోజర్లతో వారిని భయపెడుతున్నారు’’ అని కెటిఆర్ అన్నారు.
- Advertisement -