Monday, November 18, 2024

అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : వైద్యరంగంలో అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత అని నిర్వహించాల్సి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కంటి శుక్లాల తొలగింపు శస్త్ర చికిత్స కోసం రూ. 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫాకో మిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు వందల సంఖ్యలో జిల్లా కేంద్రం నుంచి వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉండేదని, కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు రోగులు వచ్చారని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 18 మంది వై ద్యులు ఉంటే ఇప్పుడు 220 మంది, ఒక్క ఫార్మసి స్టు ఉంటే ఇప్పుడు 40 మంది, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటే 38 మంది రోగులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. నిత్యం వేలాది మంది రోగులకు అద్భుతమైన సేవలు అందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పని తీరుపై సక్సెస్ కథనాలను అందించాలని మంత్రి మీడియాలను కోరారు. ఫలితంగా ప్రభుత్వ వైద్యంపై మరింత భరోసా కలిగి మరి ంత మంది పేదలు ఉచితంగా వైద్య సేవలు పొందే ందుకు వీలవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, జిజిహెచ్ ఇంచార్జీ సూపరింటెండెంట్ డా. జీవన్, డా. భాస్కర్, జిజిహెచ్ అడ్వైజర్లు లక్ష్మి, సత్యం యాదవ్ , బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్లు, వై ద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News