Monday, January 20, 2025

వైఎస్ షర్మిల ఏదైనా అడిగితే దానికి అర్హత ఉండాలి: రేణుక చౌదరి

- Advertisement -
- Advertisement -

షర్మిల తెలంగాణ కోడలైతే, తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డ
షర్మిల పార్టీ విలీనంపై అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు
వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏదైనా అడగొచ్చు, అడగడానికి ట్యాక్స్ ఏమీ లేదు, కానీ, ఏదన్నా అడగడానికి ఒక అర్హత ఉండాలని రేణుకా చౌదరి అన్నారు. పాలేరు టికెట్ అడగడానికి షర్మిలకు ఏం అర్హత ఉందని ఆమె నిలదీశారు. తెలంగాణ కోడలు అని షర్మిలకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని రేణుకాచౌదరి ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలైతే తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై తన అభిప్రాయం కూడా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లో చేరికకు షర్మిల ఒక్కరే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్నారు. పార్టీ విలీనంపై షర్మిల రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చర్చించారు అంతే కానీ, వాళ్లు ఏమి చెప్పలేదని రేణుకాచౌదరి పేర్కొన్నారు. కాగా, షర్మిల పార్టీ విలీనం చివరి దశలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనాన్ని ఓ వర్గం సమర్ధిస్తుండగా మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇక రేణుకా చౌదరి వ్యాఖ్యలపై షర్మిల ఏ విధంగా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News