ప్రపంచానికి మరో ముప్పు
ఒమిక్రాన్‌కన్నా ప్రమాదకరమైన కొత్త వేరియంట్ గుర్తింపు
ఫ్రాన్స్‌లో బయటపడిన ఈ వేరియంట్‌కు ‘ ఐహెచ్‌యు’గా తాత్కాలిక నామకరణం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇంతకు ముందు వచ్చిన వేరియంట్లకన్నా వేగంగా ఇప్పుడు ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. అసలు ఈ ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరమైనదో తెలియక ప్రపంచ దేశాలు భయపడుతూ ఉంటే .. ఇప్పుడు దానికంటే వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ బయటపడింది. యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్ కేసులు నమోదయినప్పటికీ వారంతా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ నుంచి రావడం ఇప్పుడు కలవరపెడుతోంది. దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో ఇప్పటివరకు 12 కొత్త వేరియంట్ బి.1.640.2 కేసులు నమోదయ్యాయి. వీటిని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐహెచ్‌యు మెడిటేర్రనీ ఇన్‌ఫెక్షన్’ గుర్తించింది. ఈ వేరియంట్‌కు ప్రస్తుతానికి ‘ఐహెచ్‌యు’గా నామకరణం చేశారు. కొత్త వేరింట్ బాధితుల ట్రావేల్ హిస్టరీని పరిశీలించగా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ వెళ్లివచ్చినట్లు తెలిసింది.
దీంతో శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు జరపగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లో 30 మ్యుటేషన్లు ఉండగా.. ఈ కొత్త వేరియంట్‌లో అంతకు మించి 48 ఉత్పరివర్తనాలు ఉన్నట్లు తెలిసింది. నిజానికి గత వేరియంట్లకన్నా ఒమిక్రాన్‌లోనే అత్యధిక మ్యుటేషన్లు ఉన్నాయి. దీనివల్ల ఈ వేరియంట్ వ్యాప్తి రేటు చాలా ఎక్కువగా ఉంటోంది. కానీ కొత్త వేరియంట్‌లో అంతకు మించి మ్యుటేషన్లు ఉండడంతో .. అది ఇంక ఎంత వేగంగా వ్యాప్తిచెందుతుందోనని శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ కొత్త వేరియంట్ ఇతర దేశాల్లో కనిపించలేదు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) కూడా దీన్ని అబ్జర్వేషన్‌లో ఉన్న వేరియంట్‌గా పేర్కొనలేదు. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి కొత్త వేరియంట్ ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువగా లేదని ప్రైమరీ డేటా పేర్కొంది.
IHC New Variant discovered in France