బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి బాసర ట్రిపుల్ ఐటీ) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జియుకెటి) సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2024 25 విద్యాసంవత్సరానికి 1,500 సీట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి విద్యార్థులు జూన్ 1 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 3న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఈనెల 30న ప్రకటించనున్నారు. జులై 8 నుంచి 10 వరకు సీట్లు పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
పిహెచ్, సిఎపి, ఎన్‌సిపి, స్పోర్ట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న ప్రతితోపాటు మిగతా ధ్రువపత్రాల జిరాక్స్‌ను జూన్ 29లోగా రిజిష్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా ఆర్‌జియుకెటి విద్యాలయానికి పంపాలని అధికారులు తెలిపారు. ఆర్‌జియుకెటిలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ పొందితే.. రెండేండ్ల ఇంటర్‌తో పాటు నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్‌సైట్ www.rgukt.ac.in లేదా ఇమెయిల్(admissions@rgukt.ac.in) ద్వారా సంప్రదించవచ్చు. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నెంబర్లు 7416305245, 7416058245, 7416929245 ఏర్పాట్లు చేశారు. సందేహాల నివృత్తికి అన్ని పనిదినాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.