Friday, November 15, 2024

మాటే మంత్రం

- Advertisement -
- Advertisement -

బాసర: బాసర ట్రిఫుల్ ఐటి విద్యార్థుల సమస్యలను పరిష్కరిం చి, ఆ తర్వాతే వర్శిటీకి వస్తానని విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారా వు గతంలో విద్యార్థులకు ఇచ్చిన మాట ను అన్నట్టుగానే నిలబెట్టుకున్నారు. శనివారం బాసరలో జరిగిన వర్సిటీ 5వ స్నా తకోత్సవానికి రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి వ చ్చారు. గతంలో తాను పర్యటించినప్పు డు విద్యార్థులకు ఇచ్చిన హామీలపై వర్శి టీ అధికారులను కెటిఆర్ ఆరా తీశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను, వసతులను విసి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్‌లను అడిగి తెలుసుకున్నా రు.

గతంలో తాను వచ్చినప్పటు విద్యార్థు లు ఆడిటోరియంలో నేలపై కూర్చొవడాన్ని గమనించిన కెటిఆర్.. నేను మళ్లీ వర్శిటీకి వచ్చేసరికి ఆడిటోరియంలో కు ర్చీలు ఏర్పాటు చేయిస్తానని.. ఆడిటోరియంలో విద్యార్థులతో కలిసి నేలపైనే కూ ర్చొని వారికి హామీ ఇచ్చారు. అయితే శనివారం కెటిఆర్ వచ్చేసరికి ఆడిటోరియం లో ప్రాతిపదికన కుర్చీలు ఏర్పా టు చేశారు. నాడు ఆడిటోరియంలో నేల పై కూర్చొన్న విద్యార్థులు నేడు అదే ఆడిటోరియంలో కుర్చీలపై ఆసీనులు కావడా న్ని చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇదే సందర్భంలో ఇకపై వి ద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొకుండా చూడాలని అధికారులకు సూచించారు. అందిస్తున్న భోజనం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా ణ్యమైన భోజనం అందించేందుకు టెండ ర్లు పిలవడం ఏమైనా అంతరిక్ష సమస్యనా? అని అధికారులను మందలించారు. నాణ్యమైన బోజనం పెట్టకుంటే మనం ఉన్నది ఎందుకని అన్నారు. ఈ విషయంలో సీఎం కెసిఆర్ సీరియస్‌గా ఉన్నారని సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జియూకెటిలో టి -హబ్ ఏర్పాటకు మంత్రులు సబితారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టి -హబ్ ప్రతినిధులు, వర్సిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా 2,200మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఏకరూప దుస్తులు అందజేశారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వర్సిటీలో ఉన్న చెరువును బాగుచేయించే బాధ్యత తనదన్నారు

. మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీళ్లు క్యాంపస్‌కు రావాలన్నారు. విద్యార్థుల కోసం క్యాంపస్‌లో ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని విద్యార్థులకు మరోసారి కెటిఆర్ భరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News