Wednesday, January 22, 2025

లక్నో ట్రిపుల్ ఐటి విద్యార్థికి బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

IIIT Lucknow student bags Rs 1.2 crore package to work at Amazon

అమెజాన్‌లో రూ 1.2 కోట్ల వేతన ప్యాకేజ్!

లక్నో : లక్నోట్రిపుల్ ఐటి బిటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అభిజిత్ ద్వివేదికి రూ 1.2 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ నుంచి జాబ్ ఆఫర్ లభించింది. ఐర్లాండ్‌ని అమెజాన్ డబ్లిన్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గాఅభిజిత్ ద్వివేది రికార్డుస్ధాయి ప్యాకేజ్ దక్కించుకున్నాడు. ఐఐఐzrలక్నో చరిత్రలోనే గత వేతన ప్యాకేజ్‌ల రికార్డులను ప్రయాగరాజ్‌కు చెందిన ద్వివేది చెరిపేశాడు. కొవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో ఐఐఐటి లక్నో విద్యార్ధులు అత్యధిక ప్యాకేజ్లతో నూరు శాతం పేస్‌మెంట్ సాధించారు. ఈ ఏడాది క్యాంపస్ పేస్‌మెంట్‌లో ఐఐఐటి లక్నో వార్షిక సగటు వేతనం రూ 26 లక్షలు పలికింది. ఇక ఇదే నెలలో ఎన్‌ఐటి పాట్నా స్టూడెంట్ అదితి తివారీ రూ 1.6 కోట్ల వార్షిక ప్యాకేజ్‌ను దక్కించుకుంది. జనవరిలో మరో బిహార్ విద్యార్ధి రూ 1.10 కోట్ల ప్యాకేజ్‌తో టెక్ దిగ్గజం గూగుల్ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. 2021 జులైలో హర్యానా రైతు కొడుకు అమెజాన్‌లో రూ 67 లక్షల వార్షిక వేతనంతో జాబ్ దక్కించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News