Thursday, January 23, 2025

5నుంచి బాసర ట్రిపుల్ ఐటీ దరఖాస్తులు స్వీకరణ

- Advertisement -
- Advertisement -

ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ బాసర ఆర్టీయూకెటీ బుధవారం విడుదల చేసింది. 6 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 19వ తేదీవరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్ కోటా వారికి జూన్ 24 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. జూన్ 26వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేస్తామని బాసర ట్రిపుల్ ఐటీ విసి వెంకటరమణ పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులు జూలై 1న రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఓసి, ఓబిసి విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 450 చెల్లించాలి. పదవ తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు వైస్ చాన్స్‌లర్ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News