Friday, November 22, 2024

మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

జీనోమ్ వ్యాలీలో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఐఐఎల్ సిద్ధం

రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు 750మందికి ఉపాధి

మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడులను ఆకర్శించడంలో తెలంగాణ రాష్ట్రం అప్రతిహతంగా దూసుకుపోతున్నది. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి కం పెనీలు హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మరో భారీ పెట్టుబడిని సాధించింది. శివారులోని జీనోమ్ వ్యాలీలలో సుమారు రు. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ ( ఐఐఎల్) ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీ లో ఈ సంస్థ జంతు వ్యా క్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప శువులకు పాదాలు, నో టి (ఎఫ్‌ఎండి) ద్వారా వ చ్చే రోగాలతో పాటు ఇతర పశు వ్యాధులకు సంబంధించిన టీకాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు. కొత్త గా ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంతో సుమారు 750 మం దికి ఉపాధి లభించనుంది. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ఐ ఐఎల్ ఎండి ఆనంద్‌కుమార్ ప్ర తినిధి బృందం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కెటిఆర్‌తో సమావేశమయ్యా రు. తమ నూతన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రి కెటిఆర్‌కు వివరించారు.

ప్రస్తుతం గచ్చిబౌలిలో కొనసాగుతున్న తమ తయారీ కేం ద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోస్ ల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. కొత్త గా ఏర్పాటు చేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. నగరంలో ఐఐఎల్ ఏర్పాటు చేయబోతున్న మూడవ టీకా తయారీ కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశ స్వయం సమృద్ధికి నిదర్శనమని మంత్రి కెటిఆర్‌కు ఆ సంస్థ ఎండి. ఆనంద్‌కుమార్ చెప్పారు. తమ వ్యాక్సిన్‌తో పశువులకు వచ్చే తీవ్రమైన వ్యాధులు తగ్గడంతో పాటు రైతులకు, దేశానికి వేల కోట్ల రూపాయలను ఆదా అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాగా ఐఐఎల్ సంస్థ్థ జీనోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని గా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు మరింతగా కొనసాగుతుందని కెటిఆర్ అన్నారు. ఇందుకు ఐఐఎల్ సంస్థ యజమాన్యానికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫార్మా, లైఫ్ సెన్సెస్ రాష్ట ప్రభుత్వ డైరెక్టర్ శక్తి ఎం. నాగప్పన్, ఐఐఎల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, ఎన్‌ఎస్‌ఎన్ భార్గవ్లతో పాటు సంస్థ కు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎన్‌డిడిబి అనుబంధ సంస్థ ఐఐఎల్

జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి) అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) ప్రపంచంలోని అతిపెద్ద ఎఫ్‌ఎండి వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా కొనసాగుతోంది. దీంతో పాటు భారత ప్రభుత్వ నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్‌ఎడిసిపి)కి ఎఫ్‌ఎండి వ్యాక్సిన్‌ను అందిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News