- Advertisement -
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) విద్యార్థి నిలయ్ కైలాష్‌భాయ్ పటేల్ తన 29 వ పుట్టిన రోజు వేడుకలు ఆనందంగా జరుపుకుని ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన పటేల్ జనవరి 4న అర్ధరాత్రి తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకున్నాడు. ఆ తరువాత హాస్టల్‌కు వెళ్తూ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారు జామున 6.30 గంటలకు హాస్టల్ బిల్డింగ్ వద్ద పటేల్ అచేతనంగా పడి ఉండటాన్ని సెక్యూరిటీ గార్డు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పటేల్ మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. అనుమానాస్పద మృతిగా పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పటేల్ మృతితో క్యాంపస్ అంతా విషాదం అలముకుంది. ఐఐఎంబీ సంతాపం తెలిపింది
- Advertisement -