Friday, November 15, 2024

ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్

- Advertisement -
- Advertisement -

 

 

IIS trainee officials met Governor Tamilisai Soundararajan

ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్
ఎన్‌ఎస్‌ఓ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది
యువ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌ఓ) ధైర్యానికి ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఎన్నో గొప్ప ఆపరేషన్లను ఎన్‌ఎస్‌ఓ విజయవంతంగా నిర్వహించిందని ఆమె తెలిపారు. ది ఇండియన్ ఇన్‌ఫర్‌మేషన్ సర్వీసెస్ (ఐఐఎస్) ట్రెయినీ అధికారులు ఆదివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. హైదరాబాద్‌లోని ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో(పిఐబి)కి అటాచ్ అయిన నేపథ్యంలో వారు గవర్నర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ఆధ్వర్యంలో పనిచేసే పిఐబి అధికారులకు గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఇండియన్ ఇన్‌ఫర్‌మేషన్ సర్వీసెస్‌ను తమ కేరీర్‌గా ఎంచుకోవడంపై వారిని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రాంతీయ భాషపై సరైన కమ్యూనికేషన్ కలిగి ఉండడం ఎంతో ముఖ్యమన్నారు.

తన అనుభవంలోని కొన్ని తమిళ అంశాలను, కమ్యూనికేషన్ ప్రాముఖ్యత గురించి వారికి ఆమె వివరించారు. యువ అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ సమాచార రంగంలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఆమె సూచించారు. దేశంలోని మేజర్ వార్ మెమోరియల్ స్థలాలను ఎస్‌ఎస్‌ఓ సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఓ వంటి భద్రతా సంస్థల వల్లే ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ఈ బ్లాక్ క్యాట్ ర్యాలీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మార్షల్ ఆర్ట్‌ను విద్యలో భాగం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ కోరారు.

బ్లాక్ క్యాట్ కారు ర్యాలీ ప్రారంభించిన గవర్నర్

ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌ఓ) ఆధ్వర్యంలో ‘సుదర్శన్ భారత్ పరిక్రమ’ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్న బ్లాక్ క్యాట్ కారు ర్యాలీని నెక్లస్ రోడ్డులో తమిళిసై ప్రారంభించారు. బ్లాక్ క్యాట్ ర్యాలీ ఈనెల 30న ఢిల్లీ చేరుకోనుంది. 12 రాష్ట్రాల్లోని 18 నగరాల మీదుగా 7.500 కి.మీ మేర ఈ ర్యాలీ కొనసాగి ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద ముగియనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News