న్యూఢిల్లీ: ఈజిప్టులో, సౌదీ అరేబియాలో విదేశీ క్యాంపస్‌లు తెరిచేందుకు ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఢిల్లీ(ఐఐటి ఢిల్లీ) ప్రభుత్వ ఆమోదాన్ని కోరింది. ఆ రెండు దేశాలతో ఐఐటి ఢిల్లీ అధికారులు చర్చలు కూడా జరిపారని సమాచారం. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే మాత్రం రెండు విదేశీ క్యాంపస్‌లను ఐఐటి ఢిల్లీ తెరువగలదు. కాగా వాటికి కావలసిన నిధులను ఆ దేశాలే సమకూర్చగలవు. ఈ వివరాలను ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ వి. రామ్‌గోపాల్ రావు ధృవీకరించారు. ఒకవేళ ఆమోదం అంటూ లభిస్తే ఐఐటి సిస్టంలో ఓ కొత్త అధ్యాయం మొదలుకాగలదన్నారు. ఇది మున్ముందు ఆఫ్రికా, యూరోప్‌లలో కూడా విదేశీ క్యాంపస్‌లు తెరవడానికి ఊతం కాగలదని భావిస్తున్నారు.
విదేశీ క్యాంపస్‌లు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్‌ను ఇస్తాయి. వాటిని బిటెక్ అని పిలవరు. అయితే వీటిలో ప్రవేశానికి కూడా ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుందట. పేరు తెలుప నిరాకరించిన ఐఐటి ఢిల్లీ అధికారి ఒకరు ఈ వివరాలు తెలిపారు.
ఈజిప్టు, సౌదీ అరేబియాల్లో ఐఐటి ఢిల్లీ క్యాంపస్‌లు?
- Advertisement -
- Advertisement -
- Advertisement -