Monday, December 23, 2024

అస్సాంలో అనుమానస్పద స్థితిలో తెలంగాణ విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనా అస్సాం రాష్ట్రంలోని చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పుల్లూరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నూతన సంవత్సర వేడుకలు చేసుకొవడానికి కోసం ఐశ్వర్య, ఆమె ముగ్గురు స్నేహితులు డిసెంబర్ 31న గువావాటికి వెళ్లారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌కి అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. మరునాడు ఐశ్వర్య వాష్‌ రూమ్‌ వద్ద స్పృహ తప్పి పడి ఉండటంతో హోటల్ సిబ్బంది ఆమెను గౌహతి మెడికల్‌ కాలేజీకి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News