- Advertisement -
సంగారెడ్డి: గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణను మారుస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2030 నాటికి రెండు వేట మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్‌లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్ విద్యాసంస్థ కాదు అని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అని ప్రశంసించారు. దేశ ప్రగతిలో ఐఐటిలది కీలక పాత్ర అని కొనియాడారు. ప్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెడుతామని, ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటితో సింగరేణి ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సంగారెడ్డికి ఐఐటి వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్సార్ విజన్ ఉన్న గొప్ప నాయకుడు అని ప్రశంసించారు.
- Advertisement -