Friday, December 27, 2024

ఐఐటి హైదరాబాద్‌లో పిహెచ్‌డి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా కందిలోని ’ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ 2024 విద్యాసంవత్సరానికి సంబంధించి 5 సంవత్సరాల పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్ నుంచి బీటెక్/బీఈ/బీడిజైన్/ఎంఎస్సీ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. గేట్ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాలు దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఎంపిక చేస్తాయి. ఎంపికైనవారికి ఫెలోషిప్ అందిస్తారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) అభ్యర్థులకు మొదటి 2 సంవత్సరాలు రూ.50,000, ఆ తర్వాత మూడేళ్లపాటు సీనియర్ రిసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్) హోదాలో అభ్యర్థులకు రూ.55,000 ఫెలోషిప్ పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News