Friday, December 20, 2024

ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన  కార్తిక్(21) ఐఐటీ హైదరాబాద్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 17న కార్తిక్.. ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఈ నెల19న క్యాంపస్ కి వచ్చి ఆరా తీశారు. కన్న కొడుకు ఆచూకి తెలవకపోవడంతో తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కార్తిక్ విశాఖ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కార్తిక్ ను కనిపెట్టేందుకు అతని తల్లిదండ్రులను తీసుకుని పోలీసులు వైజాగ్ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News