Thursday, January 23, 2025

కృత్రిమ గుండెను తయారు చేసిన ఐఐటి కాన్పూర్ వైద్యులు

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: గుండె జబ్బులు ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయ్యాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసు లోనే గుండె జబ్బులు వేధిస్తున్నాయి. వీటికి తోడు కరోనా వంటి అంటువ్యాధులు వల్ల కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండెపోటుకు గురైన వ్యక్తిని ఆపదలో ఆదుకునేందుకు కాన్పూర్ లోని ఐఐటి వైద్య నిపుణులు కృత్రిమ గుండెను తయారు చేశారు. దీని ద్వారా గుండెను మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేజీఎంయూ 118 వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరిపిన అనంతరం రానున్న రెండేళ్లలో మనుషులకు కృత్రిమ గుండెను అమర్చేలా సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్యశాఖ మాజీ హెడ్ డాక్టర్ ప్రభాత్ సిథోలే, కేజీఎంయు వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిపిన్‌పూరి, వైస్ చాన్సలర్ డాక్టర్ వినీత్‌శర్మతోపాటు పలువురు వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. శరీరం లోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తాన్ని అందించడం ఈ కృత్రిమ గుండెతో సాధ్యమయ్యేలా చేస్తున్నామని ఈ పరిశోధన విజయవంతమైతే గుండె మార్పిడి మరింత సులువవుతుందని ప్రొఫెసర్ అభయ్ కరాండికర్చెప్పారు. ఇది ప్రస్తుతం పరిశోధన దశలో ఉందని, త్వరలో జంతువులపై పరిశోధనలు చేపడతామన్నారు. మనదేశంలో గుండె జబ్బులకు సంబంధించి అవసరమైన 20 శాతం పరికరాలు మాత్రమే తయారవుతున్నాయని, 80 శాతం ఇంప్లాంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News