Wednesday, April 2, 2025

ఐఐటి-ఖరగ్‌పూర్‌లో 60 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

IIT Kharagpur Reports 60 Covid-19 Cases

ఖరగ్‌పూర్: ఐఐటి-ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో 40 మంది విద్యార్థులు, రిసెర్చ్ స్కాలర్లతోసహా 60 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వైరస్ సోకిన వారెవరికీ వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం లేదా అసలు లక్షణాలే లేవని, వీరంతా క్యాంపస్ హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులలో కాని హోం ఐసోలేషన్‌లో కాని లేరని రిజిస్ట్రార్ తమల్ నాథ్ మంగళవారం తెలిపారు. విద్యార్థులు-, రిసెర్చర్లు కాక వైరస్ సోకిన మిగిలిన 20 మందిలో బోధనేతర సిబ్బంది, ఫ్యాకల్టీ ఉన్నారని ఆయన తెలిపారు. క్యాంపస్‌లోని ఆసుపత్రి వైద్య సిబ్బంది వైరస్ సోకిన వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏడాదిన్నర విరామం అనంతరం డిసెంబర్ 18 స్నాతకోత్సవం అనంతరం విద్యార్థులను క్యాంపస్‌కు తిరిగి తీసుకురావాలని నిర్ణయించామని, అయితే దేశవ్యాప్తంగా కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండడంతో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం కావాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ 27 తర్వాత దాదాపు 2,000 మంది విద్యార్థులు తిరిగి క్యాంపస్‌లోకి చేరుకున్నారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News