- Advertisement -
న్యూఢిల్లీ: దేశ విదేశాలలో పేటెంట్లు దాఖలు చేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)-మద్రాసు 1,000 మైలురాయిని అధిగమించింది. గడచిన ఐదేళ్లలో ఐఐటి-మద్రాసు దాఖలు చేసిన పేటెంట్ల సంఖ్య రెట్టింపయ్యిందని, దేశం వెలుపల అత్యధికంగా అమెరికాలోనే అత్యధిక పేటెంట్లను దాఖలు చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి 1 నాటికి దేశంలో 1204 పేటెంట్లకు దాఖలు చేయగా అంతర్జాతీయంగా 523 పేటెంట్లు దాఖలయ్యాయని, వీటిలో అమెరికాలోనే 155 పేటెంట్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. విదేశీ పేటెంట్ల దాఖలు ఖర్చును 70 శాతం ఐఐటి-మద్రాసు భరించగా మిగిలిన ఖర్చును ఇన్వెంటర్లు భరించారని వారు తెలిపారు.
IIT-Madras has filed over 1000 patents
- Advertisement -