Monday, December 23, 2024

ఐఐటి మద్రాస్ క్యాంపస్‌లో అత్యధిక ఉద్యోగావకాశాలు

- Advertisement -
- Advertisement -

IIT Madras Records for More Job Offers 20221-22

న్యూఢిల్లీ: 2021-22 విద్యాసంవత్సరంలో ఐఐటి క్యాంపస్‌లో మొదటి రెండు దశల్లో జరిగే ఎంపికలకు సంబంధించి అత్యధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) రికార్డు చేసింది. ఈ రెండు దశల్లో 380 కంపెనీల నుంచి మొత్తం 1,199 ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీనికి అదనంగా విద్యార్థుల సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ల నుంచి 231 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (పిపిఒ) వచ్చాయని పేర్కొంది. దీంతో మొత్తం 1430 ఉద్యోగావకాశాలు లభించాయని, 2018-19 లో 1151మాత్రమే రాగా అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అవకాశాలు లభించాయని వివరించింది. ఇందులో 14 అంతర్జాతీయ సంస్థల నుంచి 45 అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. 2021 22 కేంపస్ ప్లేస్‌మెంట్లలో విద్యార్థులకు సరాసరి వేతనం సంవత్సరానికి రూ. 21.48 లక్షలవరకు ఉండగా, అత్యధిక వేతనం అమెరికా డాలర్ల రూపంలో 250,000 లేదా రూ.1.98 కోట్ల వరకు లభించిందని వివరించింది.

IIT Madras Records for More Job Offers 20221-22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News