Sunday, November 24, 2024

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో ఐదోసారి టాప్‌లో ఐఐటి మద్రాస్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్‌లో ఐదోసారి ఐఐటి మద్రాస్ టాప్ లో నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) బెంగళూరు ఉత్తమ యూనివర్శిటీగా ఎంపికైంది. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ శుక్రవారం ఈ ర్యాంకులను ప్రకటించారు. టాప్ 10 లో మద్రాస్, బొంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కే, గువాహటి ఈ ఏడు నిలిచాయి.

గత ఏడాది తొమ్మిదో ర్యాంకులో ఉన్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) ఈ ఏడాది అభివృద్ధి చెంది ఆరో ర్యాంకు సాధించింది. ఓవరాల్ కేటగిరిలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ తన పదోస్థానాన్ని నిలబెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News