Wednesday, January 22, 2025

వేదికపై మాట్లాడుతూ కుప్పకూలిపోయిన ఐఐటి ప్రొఫెసర్

- Advertisement -
- Advertisement -

ఐఐటి కాన్పూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సమీర్ ఖండేకర్ అనే ప్రొఫెసర్ పూర్వ విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. సమీర్ కొంతకాలంగా అధిక కొలస్ట్రాల్ తో బాధపడుతున్నట్లు తోటి ప్రొఫెసర్లు చెప్పారు. ఆయన వయసు 53 ఏళ్ళు. ఆయన కుమారుడు ప్రవాహ్ ఖండేకర్ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుతున్నాడని, అతను వచ్చాక సమీర్ అంత్యక్రియలు జరుగుతాయని కాన్పూర్ ఐఐటి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News