- Advertisement -
బెంగళూరు : ప్రముఖ గృహోపకరణాల రిటైలర్ ఐకియా డోర్‌స్టెప్ సేవలను ప్రారంభించింది. ఇకామర్స్ డెలివరీలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లో వేల సంఖ్యలో పిన్ కోడ్‌లకు ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. కొనుగోలుదారులు ఐకియా.ఇన్ వెబ్‌సైట్ ద్వారా, యాప్ ద్వారా, దాని షాప్ బై ఫోన్ సహాయ సేవ ద్వారా ఫిబ్రవరి 1 నుండి ఆర్డర్ చేయవచ్చని ఐకియా ఇండియా సిఇఒ, సిఎస్‌ఒ (చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్) సుసానే పుల్వెరెర్ తెలిపారు.
- Advertisement -