Sunday, January 19, 2025

క్యారీ బ్యాగ్ కు రూ. 20 ఛార్జీ చేసినందుకు ఐకియాకు జరిమాన!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ వినియోగదారుడికి ఇచ్చిన క్యారీ బ్యాగ్ కు రూ. 20 ఛార్జీ చేసినందుకు ఆ వినియోగదారుడు జిల్లా వినియోగదారుల ఫోరం(డిస్ట్రిక్ట్ కన్జూమర్ డిస్ ప్యూట్స్ రిడ్రెస్సల్ కమిషన్)కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ స్థానికుడికి రూ. 1000 పరిహారం ఇవ్వాలని రిడ్రెస్సల్ కమిషన్ ఆదేశించింది.

ఆ వినియోగదారుడు 2021 జూన్ నెలలో రూ. 816 విలువ చేసే వస్తువులను కొన్నాడు. కాగా ఐకియా లోగో ప్రింట్ తో ఉన్న పేపర్ బ్యాగ్ ను తీసుకోవాలని ఆ షాప్ అతడిని బలవంత పెట్టింది. ఇది ‘అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్’ అని వినియోగదారుడు అభ్యంతరం కూడా చెప్పాడు. అయినా అతడి వాదనను వినిపించుకోలేదు.

తమ బ్యాగ్ కొనాలని ఐకియా బలవంత పెట్టదని ఐకియా వాదించింది. కాగా లోగో ఉన్న క్యారీ బ్యాగ్ కు చార్జీ చేయడానికి ఐకియాకు అనుమతి ఇవ్వలేదని వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. పైగా కన్జూమర్ లీగల్ ఎయిడ్ అకౌంట్ లో రూ. 5000 డిపిజిట్ చేయాలని కమిషన్ హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ ను ఆదేశించింది. ఏప్రిల్ నుంచి 45 రోజుల్లోగా అన్నీ పూర్తి చేయాలని లేకుంటే రూ. 5000 డిపాజిట్ పై, సంవత్సరానికి 24 శాతం చొప్పున వడ్డీ కూడా పడుతుందని తెలిపింది.

కన్జూమర్ ఫోరమ్ ఇచ్చిన ఈ తీర్పు వ్యాపారాల విషయంలో సరైన పద్ధతులకు ఒక ఒరవడి కానున్నది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ విషయంలో సరైన పద్ధతులు పాటించేందుకు మార్గం సుగమం చేస్తుంది. తమ లోగోతో ఉన్న క్యారీ బ్యాగులకు అదనపు ఛార్జీలు తీసుకోకుండా స్టోర్లకు ఒక పద్ధతి నిర్ణయించినట్టయింది.IKEA store Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News