Monday, November 18, 2024

నూతన మండలాలకు ఐకెపి భవనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మండల కేంద్రాలలో ఐకెపి భవన నిర్మాణాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ఆదివారం నూతన సచివాలయ భవనంలో ఐకెపి భవన నిర్మాణాలను చేపట్టేందుకు అనుమతి ఫైలుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొలి సంతకం చేశారు. అదే విధంగా కస్టమర్ హైర్ సెంటర్ల ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. ఒక్కో సెంటర్ ను రూ.25 లక్షల తో ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందు సతీమణి ఎర్రబెల్లి ఉషా, కుటుంబ సభ్యులతో పాటు నూతన భవనంలోకి మంత్రి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సచివాలయంను అద్భుతంగా తీర్చిదిద్దారు. విశాలమైన సచివాలయం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం బాగుంది. ఇలాగే పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని మంత్రి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.

మంత్రికి అభినందనల వెల్లువ…

సచివాలయంలోని 1 ఎఫ్, 27వ గదిలో తన ఛాంబర్‌లో సీటులో ఆసీనులైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పలువురు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు. వారిలో మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాశ్, మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, పసునూరు దయాకర్, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ప్రభాకర్, తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యా నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, అరూరి రమేశ్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, రేగా కాంతారావు, దానం నాగేందర్, జెడ్పీ చైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి(జనగామ), కుసుమ జగదీశ్ (ములుగు), సుధీర్ కుమార్ (హనుమకొండ), గండ్ర జ్యోతి (వరంగల్), రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చైర్మన్లు రైతు రుణ విముక్తి సంస్థ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు,దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి, రోడ్లు భవనాలు అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, బొల్లం సంపత్, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, కృష్ణ ఆదిత్య, శశాంక్, శివలింగయ్య, భవేశ్ మిశ్రాలు హాజరై మంత్రికి శుభాకంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ సత్యనారాయణరెడ్డి, ఓఎస్డీలు రాజేశ్వర్‌రావు, రవీందర్‌రావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News