Monday, January 20, 2025

అయ్యో రామ.. ఇదెక్కడి చోద్యం..?!

- Advertisement -
- Advertisement -

రైతుల ధాన్యమైతే ఓ లెక్కా!
దళారుల ధాన్యమైతే ఓ లెక్కా!
ధాన్యం కొనుగోలు కేంద్రంపై వివాదం
నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశాం : ఐకెపి ఎపిఎం హేమంతీని

IKP centers fraud to farmers

మన తెలంగాణ/దుమ్ముగూడెం : మండలంలోని నర్సాపురం గ్రామ పంచాయతీలో గల నర్సాపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంపై బుదవారం రైతులకు, కేంద్రం వారికి మధ్య వివాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే…. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నర్సాపురం ఐకెపి ధాన్యం కేంద్రం వారు నడుచుకోవటం లేదని స్దానిక రైతులు కేంద్రం సిబ్బందిని నిలదీశారు. రైతన్నల ధాన్యంకు అయితే సవాలక్ష కోర్రీలు పెట్టే ధాన్యం కొనుగోలు కేంద్రం అధికారులు దళారుల ధాన్యంకు అయితే ఎటువంటి నిబంధనలు పాటించరూ అని కేంద్రం సిబ్బందిని నిలదీశారు. రామకృష్ణాపురంకు చెందిన ఓ రైతు ధాన్యం బస్తాలల్లో నింపి లారీలో ఎక్కించే క్రమంలో స్దానిక రైతులు అడ్డుగా నిలిచారు. ఈ ధాన్యంకు సంబంధించిన వ్యవసాయ శాఖ టోకెన్, రైతు పట్టా భూమి జిరాక్స్, ఆధార్, బ్యాంక్ జిరాక్స్‌లు ఏవి అని ఐకెపి మహిళ సంఘం సభ్యురాలుని రైతు రావులపల్లి పృధ్వీ ప్రశ్నించగా ధాన్యం రైతుకు సంబంధించిన జిరాక్స్ పేపర్లు అంటూ కేవలం రైతు ఆధార్, బ్యాంక్ జిరాక్స్‌లు చూపించడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మొదట నుంచి కూడా దళారుల ధాన్యానికే ప్రాముఖ్యత ఇస్తున్నారని రైతులు ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నల ధాన్యం అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటూ రైతులను కేంద్రం చుట్టూ తిప్పించుకోవడం జరిగిందని రైతులు అంటున్నారు. మండలంలో ప్రైవేట్‌గా ధాన్యం వ్యాపారం చేస్తున్న దళారుల ధాన్యం కూడా ఈ కేంద్రం గుండా అధికారంగా వెళ్లిందన్నారు. ఎప్పుడు అయితే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వారిని నిలదీస్తున్నారో ఆ సమయంలో అక్కడే లోడింగ్‌కు వచ్చి ధాన్యం బస్తాలు లోడ్ చేసుకోవడానికి వచ్చిన లారీ బయటకు వెళ్లిపోవడంతో పాటుగా ధాన్యంను బస్తాల్లో నింపే ముఠా కూలీలు తమ ఎలక్ట్రానిక్ ఖాటాను తీసుకోని ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిపోవడం కోసమెరుపు అని చెప్పాలి. దీనిపై కూడా రైతులు గట్టిగానే సిబ్బందిని అడుగగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఈ వివాదంపై మండల ఐకెపి ఎపిఎం హేమంతీనిని మన తెలంగాణ దినపత్రిక వివరణ అడుగగా రైతుల ధాన్యమే తీసుకుంటున్నామని, దళారులకు ప్రమేయం లేదన్నారు.

నర్సాపురం ధాన్యం కోనుగొలు కేంద్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా పంటకు మద్దతు ధర కల్పిస్తుంటే ధాన్యం కొనుగోలు చేసే అధికారులు మాత్రం నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ పట్టా ఓ రైతుది, ధాన్యం గింజలు కౌలు రైతువి అంటూ రైతులను మోసం చేస్తూ దళారుల హవా కొనసాగేలా చేస్తున్నారని రైతులు బహిరంగానే కేంద్రం సిబ్బందిని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నర్సాపురం ఐకెపి కొనుగోలు కేంద్రంలో జరిగిన ధాన్యం కొనుగోలు వ్యవహరంపై దృష్టిసారించి రైతులకు న్యాయం చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News