Monday, January 20, 2025

మంత్రిని కలిసిన నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి

- Advertisement -
- Advertisement -

ములుగు: ములుగు జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి ఆదివారం హైదారాబాద్ బంజారహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఇలా త్రిపాఠికి పుష్ఫగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, ఉద్యోగ విధుల నిర్వహణలో ప్రజల మెప్పు పొందాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలతో మంత్రి జిల్లాలోని సమస్యలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News