- Advertisement -
చెన్నై : ప్రముఖ సంగీతదర్శకులు ఇళయరాజా కూతురు , గాయని భవతారిణి కన్నుమూశారు. 47 సంవత్సరాల భవతారిని కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం లివర్ క్యాన్సర్‌తో చికిత్సకు శ్రీలంకు వెళ్లిన ఆమె గురువారం సాయంత్రం ఐదుగంటలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం అందింది. దీనితో ఇళయరాజా స్వగృహంలో విషాదం నెలకొంది. ఆమె భౌతికకాయాన్ని శ్రీలంక నుంచి చెన్నైకి తరలించే ఏర్పాట్లు జరిగాయి. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. భవతారిణి ఉత్తమగాయనిగా అవార్డు కూడా గతంలో అందుకున్నారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్‌శంకర్ రాజా ఉన్నారు. వీరు కూడా సంగీత దర్శకులే .
- Advertisement -