Monday, December 23, 2024

తల్లి కాబోతున్న ఇలియానా.. ఇదేం పద్దతంటున్న నెటిజన్లు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, పోకిరితో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతోంది. త్వరలో తన మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు ఇలియానా వెల్లడించింది. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘ది అడ్వేంచర్ బిగిన్స్’ అని ఉన్న ఓ బేబి టి షర్టుతోపాటు మామా(అమ్మ) అనే లాకెట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

దాంతోపాటు ‘కాంట్ వేయిట్ టు మీట్ యు మై లిటిల్ డార్లింగ్’ అని కామెంట్ పోస్ట్ చేసింది. అయితే, పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇలియానాపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడమేంటీ?, ఇదేం పద్దతి అంటూ కొందరు నెటిజన్లు విమర్శించగా, మరికొందరూ నెటిజన్లు.. అది తన వ్యక్తిగత విషయమంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, ఇలియానా ఓ ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ తో కొంతకాలం సహజీవనం చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతనికి కటీఫ్ చెప్పిన ఇలియానా మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి, త్వరలో రాబోతున్న తన బిడ్డకు తండ్రీ ఎవరో చెప్పి విమర్శలకు ఇలియానా పులిస్టాప్ పెడుతోందో? లేదో? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News