Saturday, January 25, 2025

పెళ్లయిందని ధ్రువీకరించిన ఇలియానా డి క్రజ్

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి ఇలియానా తాను అమెరికాకు చెందిన మైఖేల్ డోలన్ ను వివాహమాడినట్లు తెలిపింది. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చివరికి తన పెళ్లి విషయం చెప్పేసింది. దీనికి ముందు ఆమె 2023 ఏప్రిల్ లో గర్భవతినంటూ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. తర్వాత 2024 ఆగస్టులో కోవా ఫీనిక్స్ డోలన్ అనే పిల్లాడికి జన్మనిచ్చింది.

ఇంటర్వ్యూలో మైఖేల్ డోలన్ గురించి అడిగినప్పుడు ఆమె పెద్దగా నోరు మెదపలేదు. తన వైవాహిక జీవితం సంతోషంగానే ఉన్నట్లు తెలిపింది. తన భర్త గురించి చెబుతూ ‘‘ అతడు నా కష్ట కాలంలో తోడున్నాడు. నా ఆనందకర సమయాల్లోనూ అతడు నాకు చేదోడువాదోడుగా ఉన్నాడు. పరిచయం అయిన నాటి నుంచే నాతో ఒకేలా ఉన్నాడు. అతడి ప్రేమ, మద్దతు ఏదీ చెక్కుచెదరలేదు’’ అంది.

ఇలియాన నటించిన ‘దో ఔర్ దో ప్యార్’ అనే సినిమా 2024 ఏప్రిల్ 19న విడుదల అయింది. ఈ సినిమాలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి నటించారు. ఆ సినిమా వివాహేతర సంబంధాల ఆధారంగా నిర్మంచిన చిత్రం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News