Thursday, January 23, 2025

ఇలియానా బిడ్డకు తండ్రి అతనేనట!

- Advertisement -
- Advertisement -

దేవదాస్ సినిమాతో తెరంగేట్రం చేసి, పోకిరీతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ముద్దు గుమ్మ ఇలియానా డిక్రూజ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ అమ్మడు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. 2018లో రవితేజా హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ ఇలియానా నటించిన చివరి సినిమా. హిందీలో అక్షయ్ కుమార్ పక్కన రుస్తుం సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఇలియానా, చివరిగా హిందీలో అజయ్ దేవగన్ తో కలసి రైడ్ లో నటించింది.

ఇటీవల ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకునేందుకు సినిమాలకు దూరంగా ఉంటోంది. అక్టోబర్ 1న జన్మించిన తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. అయితే బిడ్డ పుట్టకముందే తన జీవిత భాగస్వామినుంచి ఇలియానా విడిపోయిందనే రూమర్లు వచ్చాయి. ఇటీవల ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే సెషన్ లో పాల్గొంది. ఇందులో ఓ అభిమాని ‘బిడ్డను ఒంటరిగా ఎలా పెంచుతున్నారు?’ అని అడిగితే, ‘నేనేమీ సింగిల్ పేరెంట్ ని కాను’ అని జవాబిస్తూ, తన లైఫ్ పార్టనర్ ఫోటోను షేర్ చేసింది. అయితే అతని పేరు మాత్రం చెప్పలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News