Friday, December 20, 2024

వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా కొడంగల్‌ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఓట్ల కోసం పాము ముంగిస ఆట ఆడుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశంలో 150 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. మిత్ర పక్షాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీడియాతో చిట్ చాట్ లో అన్నారు.

త్వరలో కాంగ్రెస్ లో కొత్త నాయకుల చేరికలుంటాయన్నారు. డిఎస్ చేరిక అధిష్ఠానం పరిధిలో ఉందన్నారు. ఇప్పటికే రెండు సార్లు సోనియాను డిఎస్ కలిశారన్నారు. నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు అపొద్దని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటే కచ్చితంగా చేర్చుకుంటామని తెలిపారు. ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టామన్న రేవంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ముందుగానే ప్రకటిస్తామన్నారు. భట్టి విక్రమార్క యాత్ర ఎఐసిసి కార్యక్రమం అన్నారు. తాను కూడా భట్టి పాదయాత్రకు హాజరవుతానని చెప్పారు. బిజెపి, బిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News