Sunday, December 22, 2024

మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్..

- Advertisement -
- Advertisement -

రాఘవ లారెన్స్.. తన డ్యాన్స్ లు, నటనతో మెప్పిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు..పేద ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే వారిలో లారెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఆయన పేదలను ఆదుకునేందుకు ఓ సంస్థనే నడుపుతున్నారు. తాజాగా లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల నారోగ్యం కారణంగా తమిళ సీనియర్ హీరో కెప్టెన్ విజయ్‌కాంత్‌ మరణించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో లారెన్స్.. విజయ్‌కాంత్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లారెన్స్.. విజయ్ కాంత్ మీదున్న ప్రేమను చాటుకున్నారు. విజయ్‌కాంత్‌ మొదటి కుమారుడు షణ్ముగ పాండియన్‌ చేసే నెక్స్ట్‌ సినిమాలో నేను కూడా నటిస్తానని.. కుదిరితే దర్శకులు మల్టీస్టారర్‌ కాన్సెప్ట్‌తో రండి.. ఇద్దరం కలిసి నటిస్తామని, కెప్టెన్‌ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్‌ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలుపుతూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. దీంతో లారెన్స్ మంచి మనసును మెచ్చుకుంటూ విజయ్‌కాంత్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News