భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పై వేసిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ఎన్నికల అధికారి కొత్తగూడెం ఆర్డిఓ శిరీష ప్రకటించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా డివి తిరిగి కొనసాగనున్నారు. డివి మునిసిపల్ చైర్మన్ డివి పై అవిశ్వాసం కోరుతూ కొందరు కౌన్సిలర్లు వినతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇల్లందు పురపాలక పాలకవర్గంలో చైర్మన్ తో సహా మొత్తం 24 మంది సభ్యులు ఉన్నారు. కౌన్సిల్ లో తగినంత మంది సభ్యులు లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ డివి, నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మరో ఇద్దరు మంత్రులకు ఇల్లందు మున్సిపల్ ప్రత్యేక సమావేశం సవాల్ గా తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ డివితో సహా బిఆర్ఎస్ నుంచి గెలిచిన 19 మంది సభ్యులకు బిఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విప్ జారీ చేశారు. ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ఇల్లందులో 144 సెక్షన్ విధించారు.