Monday, December 23, 2024

అభివృద్ధ్ధ్ది పథంలో ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట:ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తుందని, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సారధ్యంలో అభివృద్ధ్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఏఎంసి చైర్మన్ మామిడి సంజీవ్ అన్నారు. ఏడాది పూర్తి చేసుకున్న మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మార్కెట్ కమిటీ చైర్మన్‌ను అభినందించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధ్ది కోసం రూ.60 లక్షలు షెడ్ల నిర్మాణం, రూ.55లక్షలు ఏఎంసి కార్యాలయ నిర్మాణం, రూ.8లక్షలు బోరు, వాటర్ ట్యాంక్, రూ.5లక్షలతో హైమాస్ లైట్ల నిర్మాణాలు చేపట్టుతున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం మరో ఏడాది లోపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ సిద్దంవేణు, ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News