Sunday, December 22, 2024

శిశువు అక్రమ దత్తత.. నలుగురిపై కేసు

- Advertisement -
- Advertisement -

భద్రాచలంలో శిశువు అక్రమ దత్తత ఘటనలో నలుగురు వ్యక్తులు కటకటాలపాలయ్యారు. అంగన్ వాడీ సూపర్ వైజర్ సావిత్రి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం 4 నెలల కిందట జాజిత అనే మహిళ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పుట్టిన ఆడ శిశువు చనిపోయిందని చెప్పి డాక్టర్ స్పందన కాన్పుచేసింది. శిశువు చనిపోయిందని చెప్పి ప్రవీణ్ కుమార్ -పల్లివి దంపతులకు అక్రమంగా దత్తత ఇచ్చేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్రమంగా దత్తత ఇచ్చిన ఇద్దరితో పాటు పాపను తీసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News