Monday, December 23, 2024

అక్రమ అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతుకులను ఆపలేరు : డికె అరుణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళిక రహిత మాస్టర్ ప్లాన్లతో మున్సిపాలిటీలను నాశనం పట్టిస్తూ, బిఆర్‌ఎస్ నాయకుల ఆస్తుల విలువలు పెంచడమే లక్ష్యంగా పేద ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మాట్లాడారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద డికె అరుణను పోలీసులు అడ్డుకున్నారు. అటుగా వెళ్తున్న నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, డికె అరుణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే డికె అరుణను పోలీసులు అదుపులోకి తీసుకొని.. తమ వాహనంలోనే ఇందల్వాయి నుంచి నగరానికి తరలించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ -నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే, అతడినీ పరామర్శించడానికి వెళ్తే నన్ను అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ ప్రజలను రక్షించడానికి ఉంది కానీ…ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కాదన్నారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని భావిస్తే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అన్నారు. -ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం..నియంతల వ్యవహరిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. -220 జీవో ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News